ప్రజాశక్తి -పెందుర్తి : పెందుర్తి మండలంలోని పలు ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ కెఎస్.విశ్వనాధన్ పర్యటించారు. చీమలాలపల్లి సర్వేనెంబర్ 24, ఎస్‌ఆర్ పురం సర్వేనెంబర్ 135, చిన్నముసిడివాడ సర్వేనెంబర్ 196/ 4లో భూములను పరిశీలించారు. ఎస్‌ఆర్ పురం సర్వేనెంబర్ 135, చిన్నముసిడివాడ సర్వేనెంబర్ 196/4 భూములు 22 ఎలో ఉన్నట్లు గుర్తించారు. రాంపురంలో ఒక స్థలాన్ని డిజిటల్ లైబ్రరీ కోసం పరిశీలించారు. చిన్నముసిడివాడ సచివాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగనన్న కాలనీల్లో స్థల లబ్ధిదారులకు వెంటనే జియో ట్యాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎవరికైనా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ హుస్సేన్, తహశీల్దార్ ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.










