Sep 15,2023 20:27

సమావేశంలో మాట్లాడుతున్న జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

రాయచోటి : జిల్లాలో ఓటరు జాబితాకు సంబంధించి పెండింగ్‌ ఫామ్‌లను త్వరగా పరిష్కరించేందుకు కషి చేస్తున్నా మని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌ రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో 2024 ఓటరు జాబితా సంక్షిప్త సవరణపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో జెసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించడమే మనందరి లక్ష్యమన్నారు. నేటివరకు పెండింగ్‌లో ఉన్న ఫామ్‌ 6,7, 8లను తగిన ధవ పత్రాలతో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ఇంటింటి పరిశీలనలో భాగంగా జంక్‌ క్యారెక్టర్స్‌, ఒకే ఇంట్లో పది మంది కంటే ఎక్కువగా ఉన్న ఓటర్లకు సంబంధించి డిస్పోజ్‌ చేసి ఇఆర్‌ఒ నెట్‌లో అప్‌డేట్‌ చేయడం జరుగుతుందని చెప్పారు. ఫోటోగ్రాఫిక్‌ సిమిలర్‌ ఎంట్రీస్‌, మల్టిపుల్‌ ఎంట్రీలు, డెత్‌ కేసులు, జంక్‌ క్యారెక్టర్స్‌ తొలగింపులకు సంబంధించి రాజకీయ పార్టీలు కూడా తగిన సహకారం అందించాలని కోరారు. పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణలో రాజకీయ పార్టీలు తగిన సలహాలు సూచనలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో జెసి పలు అంశాలలో చర్చించి వారి సందేహాలకు తగిన పరిష్కారాలు తెలిపారు. సమావేశంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, రాజంపేట ఆర్‌డిఒలు రంగస్వామి రామకష్ణారెడ్డి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-2 ఎస్‌డిసి గోపాలకష్ణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.