Nov 03,2023 21:36

ప్రజారక్షణ భేరి సభలో మాట్లాడుతున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ. గఫూర్‌

కడపప్రతినిధి/మదనపల్లెఅర్బన్‌/ ములకలచెరువు
పెండింగ్‌లో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌ అన్నారు. శుక్రవారం అన్నమయ్య జిల్లాలోని ములకులచెరువు, మదనపల్లిలో లౌకిక వాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అస మానతలు లేని రాష్ట అభివృద్ధి పేరుతో సిపిఎం రాష్ట కమిటీ చేపట్టిన ప్రజారక్షణ భేరి బహిరంగ సభ సిపిఎం సీనియర్‌ నాయకులు హరీంద్రనాథ్‌ శర్మ అధ్యక్షతన నిర్వహి ంచారు. ములకలచేరువు నుండి మదనపల్లికి చేరుకున్న బస్సు యాత్రకు స్థానిక అన్నమయ్య సర్కిల్‌లో ద్విచక్ర వాహనాలు, ఆటోల భారీ ర్యాలీని స్థానిక చిత్తూరు బస్టాండ్‌ సభ ప్రాంగణం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్‌ మాట్లా డుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరువు విలయతాండం చేస్తుంటే ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. ఫలితంగా వేలాదిమంది నగరాలకు వలసలు పోతు న్నారన్నారు రాజకీయంగా విపక్షాలను, ప్రజా సంఘాలను ఎక్కడికక్కడ జగన్‌ ప్రభుత్వం నిర్బం ధించడం అణచివేయడం వంటి కక్షసాధింపులు చేపట్టడం దారుణమన్నారు బడా పారిశ్రా మిక వేత్తలకు వేలాది ఎకరాలు భూమిని కట్టబెడుతున్న ప్రభుత్వం పేదలు చిన్న గుడిసెలు వేసుకుంటే వాటిని కూడా నిర్ధాక్షిణ్యంగా కూల్చి వేస్తోందని చెప్పారు. కేవలం బటన్‌ నొక్కి కేటా యించిన నిధులు తక్కువని ప్రచారం మాత్రం ఎక్కువని విమ ర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధా నాలను అవలంబిస్తోందన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి మైనార్టీల, దళితుల పట్ల దాడులు చేస్తోందన్నారు. కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ లక్షలాది కోట్లు రాయితీగా ప్రకటిస్తున్న కేంద్రం కార్మికులకు, కర్షకులకు చేసింది ఏమీ లేదన్నారు.
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు
- సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి
రాష్ట్రంలో 679 మండలాలు ఉంటే అందులో 300 పైగా మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు కరువు పరిస్థితులు ఉన్నాయనిసిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. 300 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర చిన్నచిన్న వృత్తిదారులుకు ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు లేవు, చదువుకున్నామంటే సరైన విద్య వసతి లేదని తెలిపారు. పనిచేసే బతుకుదాం అంటే సరైన పరిశ్రమలు లేవన్నారు. అత్యంత వెనుకబడ్డ ప్రాంతాన్ని ఆదుకుంటా ఉద్దరిస్తామని బిజెపి రాయలసీమ డిక్లరేషన్‌ ఇచ్చిందని తెలిపారు. బిజెపి ఇచ్చిన డిక్లరేషన్‌లో రాష్ట్రానికి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తామని వెనుకబడ్డ రాయలసీమ ఉత్తరాంధ్రలో వ్యాపార, ఉపాధి కోసం పరిశ్రమలు పెడతామన్నారు.
ఆకాశానంటిన నిత్యావసరాలు
- సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమామహేశ్వరావు
నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, డీజల్‌, పెట్రోలు, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెంచేశారనిసిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమామహేశ్వరావు తెలిపారు. వైసిపి కానీ, టిడిపి కానీ ఖండించడం లేదన్నారు. రాష్ట్రంలో హంద్రీనీవా, నగరి, గాలేరు, తెలుగు గంగ, పోలవరం తదితర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయలేదన్నారు. బిజెపికి ప్రత్యామ్నాయంగా కలిసొచ్చే బావ సారూప్య పార్టీలను కలుపుకుని వేదికను ఏర్పాటు చేయడం కోసమే ఈ నెల 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఆ బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
సిపిఎం రాష్ట నాయకులు నాగశివరాణి మాట్లాడుతూ దేశంలో గ్యాస్‌, ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీల ధరలు పెరుగుతున్నాయని, అదేతీరున ఉపాధి హామీ ధరలు పెరగడం లేదని చెప్పారు. ఏటా ఉపాధి హామీ నిదుల కేటాయింపుల్లో కోత పెడుతున్పారని ఆందోళన వ్యక్తం చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమను, కర్నూలులో హైకోర్టు, తిరుపతిలో యునివర్సిటీ ఏర్పాటు చేస్తామన్న హామీలేమయ్యాయని ఎద్దేవా చేశారు. సిపిఎం రాష్ట్ర నాయకులు రమాదేవి మాట్లాడుతూ రాష్టంలోని పెండింగ్‌ ప్రాజెక్టులు సత్వరమే పూర్తిచేయాలని, భవన నిర్మాణ కార్మిక బోర్డు ద్వారా భద్రత కల్పించాలని, ఆటో కార్మికులకు భారాలను తొలగించాలని డిమాండ్‌ చేశారు.అసంఘటిత కార్మికులకు బోర్డు, పెన్షన్‌ సదుపాయాలు కల్పించాలన్నారు. కేంద్రం కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా కుదించి కార్మికులకు ఉరి తాడు బిగిస్తోందని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఖనిజాలకు, ఉధ్యాన పంటలకు నిలయమని, ఇటువంటి ప్రాంతఃలో వ్యవసాయాధారిత పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట సీనియర్‌ నాయకులు కృష్ణయ్య, సిపిఎం రాష్ట కమిటీ సభ్యులు భాస్కరయ్య,, జిల్లా నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రామా ంజులు, వెంకటరామయ్య, చిట్వేలి రవికుమార్‌, డిసి.వెంకటయ్య, నరసింహ, ప్రజలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.