Oct 15,2023 21:12

తెలుగుగంగ ప్రాజెక్ట్స్‌ సూపరింటెండెంట్‌ డి.వెంకటరామయ్య

 బ్రహ్మంసాగర్‌ పెండింగ్‌ పనులు వేగవంతం చేస్తాం. రూ.28 కోట్ల తో బ్రహ్మంసాగర్‌ కెనాల్‌ మరమ్మతు పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించాం. దీంతో 1.56 లక్షల పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. ఇందులోభాగంగా కుడి, ఎడమ కాల్వల పనుల్ని వేగవంతం చేశాం. ఎడమ కాల్వ పనుల్లో పురోగతి కని పిస్తోంది. ఇందుకుగానూ జిబిఓ, ఓబిసి పనుల్లో కదలిక నేపథ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నంద్యాల-కడప జిల్లా సరిహద్దు ప్రాంతంలోని 98 కి.మీ నుంచి 108 కి.మీ వరకు కాల్వల పనుల్ని పూర్తి చేస్తే పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందించే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్న తెలుగుగంగ ప్రాజెక్ట్స్‌ సూపరింటెండింగ్‌ ఆఫీసర్‌ ఇ.వెంకటరామయ్యతో ముఖాముఖి...
ప్రజాశక్తి - కడపప్రతినిధిబ్రహ్మంసాగర్‌ నిల్వ సామర్థ్యం ఎంత?
17 టిఎంసిల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం 5.8 టిఎంసిలు నిల్వ ఉంది. కుం దూ-పెన్నా ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే ఆయ కట్టు పూర్తిస్థాయిలో స్థిరీకరణకు అవకాశం ఉంటుంది.
బ్రహ్మంసాగర్‌ ఆయకట్టు విస్తీర్ణమెంత?
బ్రహ్మంసాగర్‌ కింద 1.56 లక్షల విస్తీర్ణం ఉంది. ఇందులో 40 వేల ఎకరాలకు సాగునీరు అంది స్తున్నాం. మిగిలిన ఆయకట్టు ఎస్‌ఆర్‌-1, ఎస్‌ఆర్‌-2 రిజర్వాయర్లు, ఎడమ, కుడి కాల్వల పరి ధిలో ఉంది. ఇందులో జిబిసి, ఓబిసి కెనాల్‌ ప్రాంతాల్లో పెండింగ్‌ పనుల్ని పూర్తి చేయడంపై ఆధారపడి ఉంది.
సాగర్‌ ఆయకట్టు వివరాలు తెలపండి?
బద్వేల్‌, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలోని 11 మండలాల్లో బ్రహ్మంసాగర్‌ ఆయకట్టు విస్తరించి ఉంది. మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట, బద్వేల్‌ నియోజ కవర్గ ంలోని బద్వేల్‌, పోరుమామిళ్ల, కలసపాడు, బి.కోడూరు, గోపవరం, అట్లూరు మండలాలున్నాయి.
పెండింగ్‌ పనుల పురోగతి ఎలా ఉంది?
బ్రహ్మంసాగర్‌ కుడి, ఎడమ కాల్వల్లోని జిబిసి, ఓబిసి ప్రాంతా ల్లోని అక్కడక్కడా ఉన్న పెండింగ్‌ పనులు వేగవంతం చేశాం. ఇందులో భాగంగా ఓబిసి ప్రాంతాల్లోని పెండింగ్‌ పనుల్ని చేపట్టడానికి కాంట్రాక్టర్‌ ముందుకు రావ డంతో పనులు పట్టాలకు ఎక్కించాం. జిబిసి కాంట్రాక్టర్‌ ముందుకెస్తే 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది. ఇందులోభాగంగా జిబిసి కింద 20 వేల ఎకరాలు, ఓబిసి కెనాల్‌ ప్రా ంతంలో 10 వేల ఎకరాలు వెరసి 30 వేల ఎకరాల ఆయకట్టు అందుబా టులోకి రానుంది.
లైనింగ్‌ పనుల పరిస్థితి ఏమిటి?
బ్రహ్మంసాగర్‌ కుడి కాల్వ 15 కిలోమీటర్లు, ఎడమ కాల్వ 58 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. రూ.9.7 కోట్లతో ఎడమ కాల్వ లైనింగ్‌ పనుల్లో 50 శాతం పురోగతి కొనసాగుతోంది. నాలుగు దఫాలుగా పిలి చిన టెండర్లలో జెకె కన్స్‌ స్ట్రక్షన్‌ కంపెనీ కాంట్రాక్టును దక్కించుకుని పనులు చేపడుతోంది. రూ.10 కోట్లతో కుడి కాల్వ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందులో 700 మీటర్ల అక్విడక్టు పనులు చేపడితే అట్లూరు మండలంలో ని ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది.
లీకేజీ మరమ్మతు ఎంతవరకు వచ్చింది?
బ్రహ్మంసాగర్‌ లీకేజీ పనులకు రూ.57 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. లీకేజీ ప్రా ంతాల్లో 36 ఫిల్లర్లను ఏర్పాటు చేయడమైంది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్లడానికి పోలవరం అథా రిటీ నిపుణుల నుంచి అందే సూచనలు, సలహాలను బట్టి ముందుకు వెళతాం. దీంతోపాటు మరో 100 మీట ర్లలో చెమ్మ తగిలిన ప్రాంతాన్నీ గుర్తించడమైంది. గ్రౌటి ంగ్‌ ప్రక్రియ సహాయంతో చెమ్మను అరికట్టే ప్రయత్నాలు చేపట్టాల్సి ఉంది.
కుందూ-పెన్నా లిఫ్టు పనుల గురించి చెప్పండి?
కుందూ-పెన్నా ఎత్తిపోతల పనులు పురోగతిలో ఉన్నాయి. 56 ఎకరాల భూసేకరణ అనంతరం ఎత్తిపోతల పనులు ఊపందుకునే అవ కాశం ఉంది. లిఫ్టు పనులను పూర్తి చేసిన అనంతరం ఎనిమిది టిఎంసి లను ఎత్తిపోసే అవకాశం ఉంది.
సర్‌ప్లస్‌ గేట్‌ ఏర్పాటు ఎప్పుడు?
బ్రహ్మంసాగర్‌ సరఫ్లస్‌ గేట్‌ సెంట్రల్‌ డిజైనింగ్‌ ఆఫీసర్స్‌ సర్వే చేసి ప్రతిపాదనలు పంపించాం. డ్రాయింగ్‌ సెక్షన్‌ నుంచి అఫ్రూవల్‌ లభించాల్సి ఉంది.