Oct 31,2023 21:06

ఉపాధి సిబ్బందితో మాట్లాడుతున్న ఎపిడి రవికుమార్‌

కలకడ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలో చేసిన పనులలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయించాలని ఎపిడి రవికుమార్‌ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రమైన కలకడ మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఉపాధి హామీ ద్వారా చేసిన పనులు పూర్తికాకుండా నిలిచిపోయిన వాటిని పూర్తి చేసి పెండింగ్‌ లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశిం చారు.కూలీలు అడిగినచోట పనులు కల్పించి వారికి ఉపాధి కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు వంద రోజులు పని కల్పించి వారికి ఉపాధి కల్పన చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఇళ్ల పైన వర్షపు నీటిని వధా చేయ కుండా వాటిని ఒడిసిపెట్టి భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాలను వద్ధిపరిచేలా చర్యలు చేప ట్టాలని సూచిం చారు. ఉపాధి పనులను పూర్తి చేస్తామని సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించినట్లు తెలి పారు. కార్యక్రమంలో ఎపిఒ చెన్నకేశవులు, ఎఇ రామకష్ణ ,టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.