Aug 04,2023 00:21

రెంటచింతల: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలోను, లబ్దిదారులకు సంతృప్తిని కలగచేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలక మని, అటువంటి ఉద్యోగుల సమస్యలను పరిష్క రించకుండా రోడ్డెక్కించడం, రిలే దీక్షలు చేయించడం ఎంత వరకు సమంజసమని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు. రెండవ రోజైన గురువారం సత్రశాల టెయి ల్పెండ్‌ ప్రాజెక్టు విద్యుత్‌ ఉద్యోగులు పలువురు రిలే నిరా హార దీక్షలు చేపట్టారు. ఈ ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పెండింగ్‌ డీఏలు ఇవ్వాలని, పర్సనల్‌ పే వద్దని, ఏక సభ్య కమిషనన్ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలో ఏఈ భరత్‌,రాజేష్‌, రంగారావు, నరేష్‌, అమర్నాథ్‌ రెడ్డి, సుబ్బారావు యాదవ్‌,వెంకటేశ్వర్లు,రమేష్‌, కోటయ్య, సుశీల, జ్యోతి, శాంతి తదితరులు పాల్గొన్నారు.