Oct 21,2023 20:41

దీక్షలో పాల్గొన్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉపాధ్యాయుల పెండింగ్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎస్‌టియు ఆధ్వర్యాన శనివారం కలెక్టరేట్‌ వద్ద ఆక్రందన పేరుతో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌టియు ఉపాధ్యక్షులు కె.జోగారావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ బిల్లులకు సంబంధించి పెండింగ్‌ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీక్షకు యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు మద్దతు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్‌, సిహెచ్‌ సూరిబాబు, వి గోవిందరావు, రవి పాల్గొన్నారు.