Aug 18,2023 20:59

ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - చిలమత్తూరు : చిలమత్తూరు మండల వ్యాప్తంగా పెండింగ్‌ లో ఉన్న 8 వారాల బిల్లులు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఫిరంగి ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపిడిఒ కార్యాలయంలో అందజేయడానికి నాయకులు వెళ్లారు. 11 గంటలైనా ఎంపిడిఒ కార్యాలయానికి రాకపోవడంతో ఖాళీ కుర్చికీ వినతిపత్రం అందజేశారు. అధికారులు కార్యాలయాలకు సమయానికి రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అన్నారు. అలాగే పెండింగ్‌ ఉపాధి బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం నాయకులు వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.