ధర్నా చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు
ప్రజాశక్తి-కూనవరం
మండలంలోని మధ్యాహ్నం భోజన పథకం కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన ఎంఇఒ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సిఐటియు మండల కార్యదర్శి కొమరం పెంటయ్య మాట్లాడుతూ జులై నెల నుంచి నవంబర్ వరకు కొన్ని పాఠశాలలకు బియ్యం రావట్లేదని తెలిపారు. నాణ్యమైన కోడిగుడ్లు ఇవ్వాలని, సేల్స్ మెన్ వేధింపులు ఆపాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మడెం బాబురావు, కే నాగమణి, కే భద్రమ్మ, ఎస్ సీత, అనంతలక్ష్మి, చిన్నక్క తదితరులు పాల్గొన్నారు.










