Mar 02,2023 22:42

 

ప్రజాశక్తి-కంచికచర్ల 

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ధరలు తక్షణమే ఉపసంహరించాలని సిపియం జిల్లా కార్యదర్ళవర్గ సభ్యులు కోట కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు. పెంచిన గ్యాస్‌ ధరలకు నిరసనగా సీపీయం ఆధ్వర్యంలో గురువారం స్థానిక రైతు బజార్‌ సమీపంలో జాతీయ రహదారిపై ఖాళీ గ్యాస్‌ సిలిండర్ల తో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన గ్యాస్‌ ధరల వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందన్నారు. మోడీ ప్రభుత్వం లో పేదలకు ఇచ్చే సబ్సిడీలకు కోత పెడుతూ, కార్పొరేట్ల కొమ్ము కాస్తుందన్నారు. తక్షణమే పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఒటియ నాయకులు బెజ్జం భూషణం, రాము, రామారావు , గణపతి, వీరమ్మ సుందరి, మార్తమ్మ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.