అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపడాన్ని సిపిఎం మండల కార్యదర్శి బి. సూరిబాబు, సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు బి.రామకృష్ణ, సిపిఐ పెదకూరపాడు నియోజకవర్గ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు విమర్శిం చారు. బుధవారం మండల కేంద్రమైన అమ రావతిలో విద్యుత్తు సబ్ స్టేషన్ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలతో పాటు అవ సరంలేని స్మార్ట్ మీటర్లను బిగించి ప్రజలపై భారం మోపడం తగదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు ప్రజలపై వేల కోట్ల రూపాయలు అదనపు భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు విద్యుత్తు దొరుకుతున్నప్పటికీ మార్కె ట్‌లో అధిక ధరతో కొనుగోలు చేయటం దుర్మార్గమ న్నారు. అవసరం లేని స్మార్ట్ మీటర్ల పేరుతో రూ. 17 వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారాన్ని మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని సభ్య సమాజం వ్యతి రేకించాలని కోరారు. రాష్ట్రంలో జలవనరులు సం పూర్ణంగా ఉన్నప్పటికీ మిగులు విద్యుత్తు ఉండాల్సింది పోయి కరెంటు కోతలు విధించడం శోచనీయ మన్నారు. అనంతరం విద్యుత్తు ఛార్జీల భారాన్ని తగ్గిం చాలని కోరుతూ కరెంట్ అధికారికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మొహిద్దీన్ వలి, రఫీ, నవీన్, బాషా,నాగుల్ మేరా సిపిఐ నాయకులు సాంబశివరావు, గోపి, శివశంకర్, రాంబాబు, పెద్దిరాజు పాల్గొన్నారు.










