Jun 19,2023 00:55

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య

సత్తెనపల్లి: పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని సిపి ఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ నెల 24వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో ప్రజాసంఘాల వారితో జరిగే రౌండ్‌ టేబుల్‌ సమావేశం జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక పుతుంబాక భవన్‌లో జరిగిన సిపిఎం సత్తెనపల్లి పట్టణ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి షేక్‌ మస్తాన్‌ వలి అధ్యక్షత వహించారు. చలమయ్య తన ప్రసం గాన్ని కొనసాగిస్తూ గత అసెంబ్లీ ఎన్నికల్లో విద్యుత్‌ ఛార్జీ లను పెంచబోమని తగ్గిస్తామని హామీ ఇచ్చిన ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాలను మోపిరని ఆయన విమర్శించారు. కరెంటు యూనిట్ల రేటు సర్దుబాటు చార్జీలు, విద్యుత్‌ సుం కం, ట్రూ ఆఫ్‌ చార్జీలు ఇలా అనేక విధాలుగా విద్యుత్‌ ఛార్జీ లను విపరీతంగా పెంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికే అతి తక్కువ ఆదాయాలతో జీవితాలను గడుపుతున్న అనేకమంది పేదలకు చెత్త పన్ను , ఆస్తి పన్ను,పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు, నిత్యావసర వస్తు వుల ధరల పెరుగుదల తో సతమతమవుతున్న ఈ నేప థ్యంలో విద్యుత్‌ ఛార్జీలు మరింత పెనుభారంగా మారా యని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభు త్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సిపిఎం పట్టణ కార్యదర్శి ధరణికోట విమల మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వ్యాపార సంస్థల వారితో స్థానిక పుతుంబాక భవన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరుగు తుందని ఈ సమావేశానికి ఆయా పార్టీల, ప్రజాసంఘాల బాధ్యులు పాల్గొని జయప్రదం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఎం సత్తెనపల్లి పట్టణ కమిటీ సభ్యులు కట్టా శివ దుర్గారావు, అనుముల వీర బ్రహ్మం, ఎం.హరిపోతురాజు,పంతంగి ప్రభాకర్‌,గద్దె ఉమాశ్రీ, జడ రాజకుమార్‌,రొంపిచర్ల పురుషోత్తం, మామి డి జగన్నాధరావు లు పాల్గొన్నారు.