Jul 01,2023 22:05

ఫొటో : తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు

పెంచిన విద్యుత్‌ ఛార్జీలు రద్దు చేయాలి
ప్రజాశక్తి-విడవలూరు : కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి ప్రజలపై భారాలను మోపేందుకు విద్యుత్‌ వినియోగదారులపై అధిక భారాలు మోపిందని, పెంచిన అదనపు ఛార్జీలను వెంటనే రద్దుచేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం విడవలూరు సబ్‌ స్టేషన్‌, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పేద కుటుంబాలకు రూ.70 వచ్చే ఇంటికి రూ.450 కరెంటు బిల్లు వస్తుందని విమర్శించారు. అదనపు ఛార్జీల పేరుతో వేలకోట్ల రూపాయలు ప్రజలపై భారం వేశారని తెలిపారు. ఇప్పటికే 7సార్ల్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలను మోసం చేశారన్నారు. స్మార్ట్‌ మీటర్ల రూపంలో విద్యుత్‌ వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.