తెనాలి: జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడు తోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధ్వజ మెత్తారు. అప్రకటిత విద్యుత్ కోతలు ఎత్తివేయాలని, పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం చెంచుపేటలోని విద్యుత్ ఈఈ కార్యాలయం ఎదుట టిడిపి నాయకులు బైఠా యించి నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ మిగులుతో రాష్ట్రాన్ని జగన్ కి అప్పగిస్తే, విద్యుత్ లేని రాష్ట్రంగా తయారు చేశారన్నారు. యూనిట్ కి పైసా కూడా పెంచకుండా చంద్రబాబు పాలన చేశారని, వైసిపి ప్రభు త్వంలో గణనీయంగా విద్యుత్ ఛార్జీలు పెంచేశారని విమర్శించారు. చివరికి సౌర విద్యుత్తునూ నాశనం చేశారని ధ్వజమెత్తారు. నిరంతర విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనత జగన్ కే దక్కు తుందని, విద్యుత్ సర్‌ఛార్జీలు, ట్రూ అప్ చార్జీల పేరిట పేద ప్రజలపై ప్రభుత్వం భారం మోపిందని అన్నారు. విద్యుత్ చార్జీలను ఇష్టానుసారంగా పెంచిన ప్రభుత్వం, ఆ ఆదాయాన్ని ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎన్నికలవేళ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని నాడు హామీ ఇచ్చిన జగన్, దానిని విస్మరించారన్నారు. విద్యుత్ కార్పొరేషన్ మీద తీసుకున్న 25 వేల కోట్ల ప్రజాధనం ఏమైందో జగన్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొరత కారణంగా రాష్ట్రం నుంచి పరిశ్రమలు కూడా పారిపోతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పెంచిన విద్యుత్త్ ఛార్జీలను తగ్గిం చాలని, అప్రకటిత విద్యుత్ కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యుత్ ఈఈ చిరం జీవికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు టి.హరి ప్రసాద్,మహమ్మద్ ఖుద్దూస్, కౌన్సి లర్‌లు దివి అనిత, బ్రహ్మేశ్వరరావు ,అన్నం పిన్నారావు, నాయకులు కె.కోటేశ్వరరావు, పి.నరేంద్ర, జెట్టి రేణుక, పి.మహేష్, ఎ.రమేష్, ఈ.వెంకట పూర్ణచంద్, కె. శ్రీనివాసరావు, పి.రమ్య, కె.ఏడుకొండలు, పాల్గొన్నారు










