Sep 27,2023 16:20

కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సిపిఎం, సిపిఐ నాయకులు

పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించకుంటే మరో విద్యుత్ ఉద్యమం..
బషీర్ బాగ్ స్ఫూర్తితో విద్యుత్ పోరాటం - సిపిఎం, సిపిఐ నేతలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
    రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించి. స్మార్ట్ మీటర్ల ఆలోచన విధానాన్ని విరమించకపోతే 2000 సంవత్సరం బషీర్బాగులో జరిగిన  విద్యుత్ ఆందోళన స్ఫూర్తితో మరో ఉద్యమం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పతనం తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు   హెచ్చరించారు.రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని. స్మార్ట్ మీటర్ల ఆలోచన విధానాన్ని విరమించుకోవాలని. ప్రజా ఉద్యమాలపై పోలీసులతో అక్రమ అరెస్టులు చేయడం మానుకోవాలని డిమాండ్  వామపక్ష పార్టీలు రాష్ట్ర కమిటీలు పిలుపు మేరకు నంద్యాల జిల్లా లో బుధవారం సిపిఎం,సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలతో స్థానిక నూనెపల్లి ఓవర్ బ్రిడ్జి  నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి  ధర్నా  చేపట్టారు. అనంతరం ఏ ఓ కు వినతిపత్రం సమర్పించారు.ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి పి నరసింహులు,సిపిఐ పట్టణ కార్యదర్శి కే ప్రసాద్  అధ్యక్షత వహించారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు  లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలు విద్యుత్ చార్జీలు ట్రూ అప్ చార్జీలు పేరుతో 50వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారాలు మోపడం  దుర్మార్గమైన చర్య  అన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రధాని  నరేంద్ర మోడీ కి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టుపెట్టి విద్యుత్ సంస్కరణలో భాగంగా విద్యుత్తు చార్జీలపై ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజల్లో పై భారం మోపడమే కాకుండా రైతుల వ్యవసాయ మోటార్లకు కు విద్యుత్ మీటర్లను బిగించి రైతులకు మరో ఉరితాడు వేయాలనే దుర్మార్గమైన ఆలోచన ను విరామించుకోవాలన్నారు.రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రశ్నించి ఉద్యమాలను నిర్విస్తున్న ప్రజాసంఘాల నాయకులపై పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయ డాన్ని మానుకోవాలని హెచ్చరించారు.సిపిఎం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. నాగరాజు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్లు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఎస్. సుంకయ్య కే శ్రీనివాసులు.భాస్కర్. సిపిఎం జిల్లా నాయకులు మద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు డి.లక్ష్మణ్.నాయకులు రామరాజు, కె ఎం డి గౌస్,వెంకట్ లింగం. రామచంద్రుడు,బాల వెంకట్,మార్క్, డివైఎఫ్ఐ నాయకులు ఓ.లక్ష్మణ్,శివ,జిలాని బాషా,మహిళా సమాఖ్య నాయకురాల్లు సుగుణమ్మ. నారాయణమ్మ. బీబీ. సిపిఐ నాయకులు ధనుంజయ. నాగరాముడు. డి శ్రీనివాసులు. సోమన్న. భూమిని శ్రీనివాసులు. నారాయణ. సామేలు బాలకృష్ణ.   తదితరులు పాల్గొన్నారు.

 

కలెక్టరేట్ వరకు ర్యాలీగా వస్తున్న వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు
కలెక్టరేట్ వరకు ర్యాలీగా వస్తున్న వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు