పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ధర్నా
రూపాయి ఇచ్చి 100 రూపాయలు నొక్కే స్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి సమాధి కట్టే రోజు వచ్చింది
మాజీ ఎమ్మెల్యే భూమా
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రాష్ట్రంలో వరుసగా ఎడవసారి పెంచిన విద్యుత్తు చార్జీలను నిరసిస్తూ తెలుగు దేశం పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంా నంద్యాల పట్టణంలోని విశ్వ నగర్ సబ్ స్టేషన్ వద్ద తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి భూమా బ్రహ్మానందరెడ్డి యువనేత ఫిరోజ్ ఆద్వర్యంలో తెలుగు తమ్ముళ్లు భారీ నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎం ఎల్ ఏ భూమా మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి పేదోడి నడ్డి విరిచిందని ఆవేదన చెందారు.విద్యుత్ చార్జీల పెరుగు దలతో పరోక్షంగా అనేరకాలుగా ధరలు పెరిగి సామాన్యుడి బ్రతుకు దుర్భరం అయిందన్నారు..సంక్షేమం పేరుతో ఒక్క రూపాయి ఇస్తూ 100రూపాయలు ప్రజల జేబులకు జగన్ రెడ్డి ప్రభుత్వం చిల్లు పెడుతోంది అన్నారు..సంక్షేమ పదకాలు కొంతమందికి ఇచ్చి 80శాతం ప్రజలను రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం నిట్టనిలువుగా ముంచేసి ఇప్పుడు జోలె పట్టుకుని ఇంటింటికి స్తిక్కర్లు ఏ ముఖం పెట్టుకొని అంటిస్తారు అని భూమా దుయ్యబట్టారు..స్థానిక ఎమ్మెల్యే ఆదివారం ఎం ఎల్ ఏ అని సాక్షాతూ వైసిపి కార్యకర్త నామకరణం చేశారని ఈయన ఏదో సందులో చిన్న రోడ్డు వేసి నాడు నేడు అని ఫోటోలు పెట్టడం హాస్యాస్పదం అన్నారు..ఆర్ ఎ ఆర్ ఎస్ భూములు నిర్వీర్యం చేసి మెడికల్ కాలేజ్ పేరుతో ప్రజలను రైతులను మోసం చేశారని భూమా విమర్శించారు..ప్రజలు అన్నీ గమనించి ఇటీవల చెప్పుతో కొట్టినట్లు ఎం ఎల్ సి పలితాలు ఇచ్చారన్నారు...ఫిరోజ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆకండ విజయం సాధించడం ఖాయం అన్నారు..కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.










