ప్రజాశక్తి-చోడవరం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను సగానికి తగ్గించాలని కోరుతూ సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దారు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పిఎస్.అజరు కుమార్ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు జరిగి ఫలితాలు రాగానే మోడీ సర్కార్ వంట గ్యాస్ ధరను ఒక సిలెండర్‌పై రూ.50, వాణిజ్య సిలింగర్‌పై రూ.350 పెంచి ప్రజల నడ్డి విరిచే నిర్ణయం చేసిందని తెలిపారు. గతంలోనూ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని గుర్తు చేశారు. కేంద్రం బిజెపి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడంలో రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్.గణేష్, కె.కొండలరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.










