ప్రజాశక్తి - విలేకరులు
విశాఖలో సుమారు 811 రోజులుగా స్టీల్‌ప్లాంట్ కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ట్రేడ్ యూనియన్లు, వామపక్షాలు, కార్మి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో బుధవారం పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని మండలాల్లోని ప్రధాన రహదారులపై రాస్తాకోకోలు చేశారు. పలుచోట్ల ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలని కోరుతూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఏలూరు అర్బన్:విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరణ చేయొద్దని కోరుతూ స్థానిక వసంత మహల్ సెంటర్‌లో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు, ఎఐటియుసి ఏలూరు జిల్లా కన్వీనర్ బండి వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేనలు కేంద్రంపై పోరాడాలని వారు డిమాండ్ చేశారు. పరిశ్రమకు అవసరమైన ఐరన్ గనులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రయివేటీకరిస్తే ఎంతోమంది ఉపాధి కోల్పోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.సోమయ్య, పి.రామకృష్ణ, ఎ.శ్యామలారాణి, నాయకులు పి.ఆదిశేషు, సిఐటియు జిల్లా నాయకులు కొర్రి విజయలక్ష్మి, నగర అధ్యక్షులు బి జగన్నాథరావు, సిపిఐ నాయకులు ఉప్పులూరు హేమశంకర్, పుప్పాల కన్నబాబు, ప్రసాద్, కడుపు కన్నయ్య, ఎఐటియుసి నాయకులు రెడ్డి శ్రీనివాస్‌డాంగే, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు బద్దా వెంకట్రావు, ఐఎఫ్‌టియు నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, బాలాజీ, గురుమూర్తి ఈశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు ఉప్పు మురళీకృష్ణ, చంద్రశేఖర్, చద్రకాంతమ్మ, డిసిఒ సుబ్బారావు, సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి : స్థానిక మెయిన్ సెంటర్‌లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సత్తు కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చాకిరి శివనాగరాజు, షేక్ జహంగీర్ బాష, జలసూత్రం గోపాలరావు, బండి కోటేశ్వరరావు, నైనవరపు ఊళక్కయ్య, పలువురు కార్మికులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం:విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపాలని ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా బిజెపి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని సిఐటియు, ఎఐటియుసి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సిఐటియు, ఎఐటియుసి, ఇతర కార్మిక, ప్రజాసంఘాల, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పసల సూర్యారావు అధ్యక్షతన మార్కెట్ యార్డ్ బైపాస్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు టౌన్ కార్యదర్శి షేక్ సుభాషిణి, సిపిఐ మండల కార్యదర్శి జెవి.రమణరాజు, సిపిఎం మండల కార్యదర్శి మానుకొండ జీవరత్నం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల గోడు పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందన్నారు. దేశానికే గుండెకాయ వంటి విశాఖ ఉక్కును ప్రయివేటీకరించడం దారుణమన్నారు. ఎందరో ప్రాణత్యాగాలు చేసి, పిల్లల భవిష్యత్‌కు, ఎంతోమందికి ఉద్యోగాలు లభిస్తాయని ముందుచూపుతో చిన్నచిన్న రైతులు కూడా తమ భూమిని స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి త్యాగం చేశారని తెలిపారు. బిజెపి అడుగులకు మడుగులొత్తుతున్న వైసిపి, టిడిపి, జనసేనల వైఖరి మారాలన్నారు. ఈ కార్యక్రమంలో చల్లారి మాణిక్యాలరావు, డివైఎఫ్‌ఐ నాయకులు జి.సూర్యకిరణ్, వెంకటరాజు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బి.యశ్వంత్, రైతు సంఘం నాయకులు బి.రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అందుగుల ప్రభాకర్, సిపిఐ నాయకులు సిహెచ్.శ్రీను, సుంకర రాధాకృష్ణ, ఎఐటియుసి నాయకులు కొత్తూరి నాగేశ్వరరావు, విమలేష్, లక్ష్మణరావు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : విశాఖ ఉక్కును పరిరక్షించాలని కోరుతూ స్థానిక ప్రధాన రహదారిపై కార్మిక, ప్రజాసంఘాల, వాపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కారం రాఘవులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.నాగమణి, సిపిఎం మండల కార్యదర్శివర్గసభ్యులు పోలోజు నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు కారం భాస్కర్, పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షులు బి.వినోద్ పాల్గొన్నారు.
కొయ్యలగూడెం : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక సెంటర్‌లో సిఐటియు, ఎఐటియుసి, సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కార్మికులు, నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు, సిపిఐ మండల కార్యదర్శి జమ్ము శ్రీను, నాయకులు రామన్న, చెరుకూరి మరిడియ, రాచూరి నాగేశ్వరరావు, దుర్గారావు, పిల్లా తమ్మారావు, గోపి, కడియం సీతారా ముడు, ముప్పిడి సురేష్, ఎస్‌కె.బాబ్జీ, నరసయ్య, బుచ్చిరాజు పాల్గొన్నారు.
వేలేరుపాడు : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ధర్ముల రమేష్, మడివి దుర్గారావు, కె.వెంకట్రావు, ఎంఎల్ ప్రజాపంధా నాయకులు ఎస్‌కె.గౌస్, ఎస్.రామారావు, సిపిఐ నాయకులు ఎమ్‌డి.మునీర్, రాము, సాయిబాబా, టిడిపి నాయకులు ఎ.అశోక్ పాల్గొన్నారు.
కుక్కునూరు : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తిరుపతిరావు, శివ, వెంకట్రావు, వెంకటేశ్వర్లు, రాంబాబు పాల్గొన్నారు.
నేతల నిర్బంధం
నిర్బంధాలు, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, విశాఖ ఉక్కు అమ్మకం ఆపేంతవరకూ పోరాటాలు చేస్తామని సిపిఎం మండల కార్యదర్శి యర్రంశెట్టి నాగేంద్రరావు, సిఐటియు మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్ అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా నాగేంద్రరావుకు, సాయికిరణ్‌కు పోలీసులు మంగళ వారం నోటీసులు ఇచ్చి నిర్బంధం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
భీమడోలు:విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, అమ్మేది ఎవడు, కొనేది ఎవడు అంటూ నినాదాలు చేస్తూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షించాలని కోరుతూ భీమడోలు జంక్షన్‌లో బుధవారం రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, టిడిపి నేతలు పి.యుగంధర్ ,శేషపు శేషగిరి, సిపిఎం నేత కట్టా భాస్కరరావు, రైతు సంఘం నాయకులు జి.ప్రసాదరావు మాట్లాడారు.
ముసునూరు : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ముసునూరు సెంటర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పిల్లి మురళీ, గంగులు సత్యనారాయణ, కంచర్ల దుర్గారావు, కంచర్ల శ్రీను, సిఐటియు నాయకులు పి.రత్నం, ఎ.నాగరాజు, వెంకటేశ్వరరావు, రెడ్డి తిరుపతిరావు పాల్గొన్నారు.
చింతలపూడి : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఎఐటియుసి, సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక బోసుబొమ్మ సెంటర్‌లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవినేని రమేష్, నాగు, నక్కా తిరుపతిరావు, రాజుబోయిన వెంకటేశ్వరరావు, శ్రీను పాల్గొన్నారు.
నూజివీడు రూరల్ : నూజివీడు పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటర్‌లో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ మాట్లాడుతూ ఎందరో ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మడం హేయమైన చర్య అని అన్నారు.










