Sep 10,2023 21:41

ప్రజాశక్తి - యంత్రాంగం
          టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ జిల్లావ్యాప్తంగా ఆదివారం పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేశారు. పలుచోట్ల కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.
ఉంగుటూరు : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నాయకులు ఉంగుటూరులో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. స్థానిక ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద జరిగిన ఈ దీక్షలో మండల టిడిపి మాజీ అధ్యక్షులు రవిశంకర్‌, బొమ్మిడి అప్పారావు, మారిశెట్టి ప్రసాద్‌, నేకూరి ఆశీర్వాదం, దిడ్ల శ్రీను, మోషే, నాయకులు నల్లా ఆనంద్‌ పాల్గొన్నారు.
ముదినేపల్లి : చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టిడిపి నేతలు మండలంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పెదపాలపర్రులో పార్టీ మండల మాజీ అధ్యక్షులు చల్లగుళ్ల శోభనాద్రిచౌదరి ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. గ్రామ ప్రధానసెంటర్‌లో రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో గ్రామ సర్పంచి గంటా రాకేష్‌, ఉపసర్పంచి వెంకటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టి.నరసాపురం : చంద్రబాబు అరెస్టు అనైతిక చర్య అని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి తోట లక్ష్మీ నారాయణ అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కొయ్యలగూడెంలో పోలవరం నియోజకవర్గ టిడిపి కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక నిరాహార దీక్షకు సంఘీభావంగా మండలం నుండి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం తరలి వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబును రాజకీయ కక్షతో అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టు చేయడం అనైతిక చర్య అని అన్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజాక్షేత్రంలో జగన్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగురైతు ఆర్గనైజింగ్‌ కమిటీ రాష్ట్రకార్యదర్శి వాసిరెడ్డి మోహన్‌రావు, కాల్నీడి రాంబాబు, గండబోయిన శ్రీను, సాయి పాల్గొన్నారు.
చింతలపూడి : చంద్రబాబును తక్షణం విడుదల చేయాలని మాజీ ఎంఎల్‌ఎ గంటా మురళీ, ఎఎంసి మాజీ ఛైర్మన్‌ జగ్గవరపు ముత్తారెడ్డి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద ముత్తారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శిబిరంలో టిడిపి మండల అధ్యక్షులు మాటూరి వెంకట రామయ్య, ప్రధాన కార్యదర్శి కోండ్రు దేవ, పట్టణ అధ్యక్షులు పి.వెంకటేశ్వరరావు, కార్యదర్శి బోడా భూషణం, ఎస్‌సి సెల్‌ నియోజకవర్గ కన్వీనర్‌ పల్లి శ్రీను, ఐటిడిపి నియోజకవర్గ అధ్యక్షులు బొడా అనీష్‌కుమార్‌, మానేపల్లి రాజారావు తాళ్లురి చంద్రశేఖర్‌రెడ్డి, యువ నాయకులు బొమ్మజి అనిల్‌, సొంగా రోషన్‌ కుమార్‌, కామరపుకోట మండల పార్టీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ, నియోజకవర్గ నా యకులు మారుమూడి థామస్‌, వీరేంద్ర పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పోలవరం నియోజకవర్గ టిడిపి కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో స్థానిక క్యాంపు కార్యాలయం వద్ద సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. ఆయనతో పాటు, నియోజకవర్గ ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు చాపల విజయకుమార్‌, తెలుగుయువత మండల ఉపాధ్యక్షులు సుంకర వెంకట్రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముసునూరు : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కాట్రేనిపాడులో టిడిపి నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ దీక్ష చేపట్టారు. దీక్షలో గద్దల సుహాసిని మోహన్‌రావు, బడిపాటి సాంబయ్య, రాపర్ల ప్రతాప్‌, రాపర్ల బాలకృష్ణ, రాపర్ల సత్యనారాయణ, ముక్కయ్య, సూర్యదేవర శ్రీనివాసరావు, సొంగా ఇస్సాక్‌, వెంకటరావు, పిన్నబోయిన మంగయ్య, చంటి, శ్రీను పాల్గొన్నారు. మండలంలోని పలుగ్రామాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు.
చాట్రాయి : చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ నిరాహార దీక్షకు బయలుదేరిన టిడిపి నాయకులను, కార్యకర్తలను చాట్రాయిలోని ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి ఇంటివద్ద రెండో రోజు కూడా పోలీసులు అడ్డుకున్నారు. వారిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కార్యదర్శి కంచర్ల హనుమంతరావు, పార్టీ గ్రామ అధ్యక్షులు గడ్డం ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు కంపసాటి శంకర్‌రావు, చల్లారి రామకకృష్ణ, మరీదు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కైకలూరు : స్థానిక టిడిపి కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కలిదిండి : కైకలూరులో జరిగిన రిలే నిరాహారదీక్షా శిబిరానికి కలిదిండి నుండి టిడిపి నేతలు తరలివెళ్లారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, జగన్‌రెడ్డి పాలనను సాగనంపాలని రాష్ట్ర బిసి సెల్‌ కార్యదర్శి ఆండ్రాజు శ్రీనివాసరావు కోరారు. బిసి సెల్‌ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసచక్రవర్తి, సర్పంచులు గూడవల్లి శ్రీనివాసరావు, పరసా వెంకట స్వామి, ఎస్‌సి సెల్‌ మండల అధ్యక్షులు కురెళ్ల ఏడుకొండలు, రైతు విభాగం అధ్యక్షులు విష్ణుమూర్తి, శ్రీను పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ స్థానిక బోసుబొమ్మ సెంటర్‌ వద్ద టిడిపి నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. టిడిపి పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో బోసుబొమ్మ కూడలి వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు రావు కృష్ణ, మండల అధ్యక్షులు సాయల సత్యనారాయణ, షేక్‌ ముస్తఫా, రమాదేవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.