Sep 10,2023 22:32

ప్రజాశక్తి - మొగల్తూరు
              మండలంలోని పేరుపాలెం బీచ్‌లో ఆదివారం పర్యాటకులతో సందడి నెలకొంది. పర్యాటక, ప్రకృతి ప్రేమికులు సుదూర ప్రాంతాల నుంచి బీచ్‌కు ఉదయమే చేరుకున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో అధిక సంఖ్యలో పర్యాటకులు బీచ్‌కి తరలివచ్చారు. పలువురు సముద్ర కెరటాల్లో స్నానాలు చేశారు. చిన్నారులు ఒడ్డుకు కొట్టుకువస్తున్న కెరటాలతో ఇసుక తెన్నెలపై ఆటలాడుకున్నారు. ఒడ్డున ఉన్న ఆలయాలు దర్శించుకుని సరివి కొబ్బరి తోటల్లో సహపంక్తి భోజనాలు చేశారు.