Sep 28,2023 23:07

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్‌
మండలంలోని ఇడుపులపాడు విద్యాపరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పిడపర్తి పేరిరెడ్డి విద్యారంగంలో సేవలు మరింత విసృతం చేయాలని బాపట్ల ఎంపి నందిగం సురేష్‌ కొనియాడారు. హెచ్‌ఎంల విభాగంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన పేరిరెడ్డిని సత్కరించారు. విద్యారంగానికి, ఎన్సీసీకి చేసిన సేవలను గుర్తించటం, మీ కార్యదీక్ష, పట్టుదల, నిరంతర కృషికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానం చేయడం చాలా అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు మరిన్ని పొందాలని ఆకాంక్షించారు.