మేడికొండూరు: మండల సిఐటియు సంఘ బాడీ సమావేశము శుక్రవారం రాత్రి పేరేచర్ల లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా సిఐటి నాయకులు లక్ష్మణ్ పాల్గొన్నారు. ప్రత్యేక అజెండాగా గత 11 రోజుల నుండి కార్మికులు తమ సమస్యల పరి ష్కారం కోసం కంపెనీ దగ్గర చేపడుతున్న నిరసన అం శాలపై చర్చించారు. ప్రధానంగా కంపెనీ యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కరించకుంటే సమ్మె ఉధతం చేస్తామని కంపెనీ యాజమాన్యానికి లేఖ పంపడం జరిగింది. దీనిపై స్పందించిన కంపెనీ యాజమాన్యం శనివారం చర్చలకు రావాలని తెలిపింది. కంపెనీలో పని చేసే ఆఫీస్ బేరర్లు మాత్రమే ఈ చర్చలకు హాజరై కంపెనీ యాజమాన్యంతో మాట్లాడేలా సిఐటియు సమా వేశం బాడీ తీర్మానం చేసింది. చర్చలు విఫలమైతే సమ్మె తప్పదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల సిఐ టియు నాయకులు షేక్ బాషా, మండల సిపిఎం కార్యదర్శి బి.రామకృష్ణ, పలువురు ప్రజా సంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు.
11వ రోజు కొనసాగిన నిరసన
మండలంలోని పేరేచర్ల నికో ఆగ్రో ఆయిల్ కంపెనీ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి వెళ్తామని యూనియన్ సిఐటియు మండల కార్యదర్శి ఎస్ ఏం భాషా స్పష్టం చేశారు. శుక్రవారం కంపెనీ వద్ద సమ్మె డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పి.శౌరి రాజు, సోహెబ్, ఎస్ సంగీతరావు, పి జోసెఫ్, బి నాగరాజు, నయూబ్, రహమతుల్లా, వి స్వామి, కే శ్రీనివాస రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










