పేకాట స్థావరంపై మెరుపు దాడులు
- రూ.51000 నగదు స్వాధీనం
- పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
ప్రజాశక్తి- గూడూరు రూరల్ : గూడూరు రూరల్ పరిధిలోని కుందకూరు లోని కొండ కింద గట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు గూడూరు రూరల్ ఎస్‌ఐ బ్రహ్మనాయుడు తమ సిబ్బందితో కలిసి పేకాట స్థావరాలపై సోమవారం మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్న నలుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి నుండి రూ. 51 వేల రూపాయల నగదును ఎస్‌ఐ బ్రహ్మనాయుడు వారి సిబ్బందితో కలిసిపట్టు కున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ బ్రహ్మనాయుడు మాట్లాడుతూ జూదం ఆడినా, ప్రోత్సహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిం చారు. జూదం ఆడడం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయన్నారు. ఎక్కడైనా జూదం ఆడినట్లు గుర్తిస్తే తమకు సమాచారం అందజేయాలని కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని రూరల్ ఎస్‌ఐ బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. ఈ దాడుల్లో స్టేషన్ సిబ్బంది శ్రీను విష్ణు పాల్గొన్నారు.










