Sep 17,2023 00:48

ప్రజాశక్తి - అద్దంకి
పట్టణంలోని కమటేశ్వర స్వామి దేవాలయంలో పట్టణ విశ్వబ్రాహ్మన అధ్యక్షులు పొన్నపల్లి బ్రహ్మానందం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సోడా బండితో జీవనం సాగిస్తున్న బొప్పూడి కృష్ణ కుమార్తె శ్రావణి బిటెక్ మొదటి సంవత్సరం చదువుతూ ఫీజుకి ఆర్థిక ఇబ్బంది పడుతుండగా సంఘం ఆధ్వర్యంలో దాతలు ద్వారా  సేకరించిన రూ.5వేలు శనివారం విద్యార్థిని శ్రావణికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంఘం అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసాచారి మాట్లాడుతూ ఆదివారం జరుగనున్న విశ్వకర్మ జయంతిని ప్రభుత్వ పండుగగా గుర్తించడం అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా బీసీలు అభివృద్ధి కోసం పిఏం విశ్వకర్మ కౌసల్ యోజన పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సాంప్రదాయ చేతివృత్తుల వారికి తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు మోడీ పధకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విజయవాడ, విశాఖపట్టణంలోనూ పధకం ప్రారంభ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అర్హులైనవాళ్లు ఆన్‌లైన్‌లో దరకాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి వీరయ్య, వేద పురోహితులు సత్తెనపల్లి శ్రీశైలం, చోడ వెంకట సుబ్బారావు, అనంత మురళి, పొన్నపల్లి మల్లికార్జున, ఏలూరి వీరబ్రహ్మం, ఉయ్యూరు శ్రీరాములు పాల్గొన్నారు.