
ప్రజాశక్తి - భోగాపురం : రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఆరోగ్యానికి భరోసా కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని గూడెపువలస సచివాలయంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మళ్లీ ఎమ్మెల్యేగా అప్పలనాయుడును మనమంతా గెలిపించుకోవాలని అప్పుడే మన మండలం పూర్తిస్థాయిలో ఇంకా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఎన్ అప్పలనాయుడు, తహశీల్దార్ చింతాడ బంగార్రాజు, పోలిపల్లి వైద్యాధికారి తిరుపతిస్వామి ఇఒపిఆర్‌డి సురేష్, ఎంఇఒలు రమణమూర్తి, చంద్రమౌళి, ఎపిఒ ఆదిబాబు, ఎపిఎం రమణ, నాయకులు కొల్లి రామ్మూర్తి, దల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తెర్లాం: జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరమని ఎంపిడిఒ ఎస్.రామకృష్ణ అన్నారు. శుక్రవారం వెలగవలస సచివాల యంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సురక్ష నిర్వహించి ప్రతీ ఒక్కరికీ అవసరమైన సర్టిఫికెట్లు ఉచితంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి ఎస్ సత్యనారాయణ, వైసిపి మండల అధ్యక్షులు టి. సత్యం నాయుడు, సర్పంచులు బి శేషగిరి, ఆదినారాయణ పాల్గొన్నారు.
బొబ్బిలి: జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజల వద్దకు వైద్య సేవలు అందుతున్నాయని మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ అన్నారు. పట్టణంలోని 16,17 వార్డులలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు, కౌన్సిలర్ ఎస్.బాబు, మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, టిపిఆర్‌ఓ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్: నగరంలోని వీటి అగ్రహారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ, చిక్కాల వీధిలోని ఆర్కే పాఠశాలలో శుక్రవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ ప్రసాద్ రావు ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు చందక శ్రీనివాసరావు, రేగాన రూపా దేవి, బొంగ భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.