Jun 28,2023 20:46

చెక్కు అందజేస్తున్న డిప్యూటీ సిఎం, మేయర్‌, ఎంఎల్‌సి

కడప అర్బన్‌ : విద్యకు పేదరికం ఏ మాత్రం ఆటంకం కాకూడదనేదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌ బాషా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సభాభావన్‌లో ''జగనన్న అమ్మఒడి'' పథకం 4వ విడత కార్యక్రమాన్ని ప్రారం భించారు. జిల్లాలో ''అమ్మఒడి'' లబ్దిదారులైన 1,80,203 మంది విద్యార్థుల తల్లులకు మంజూరైన మూడవ ఏడాది లబ్ది మొత్తం రూ.270, 30,00,000ల మెగా చెక్కును ముఖ్య అతిధుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒక కుటుంబం, ఒక సమాజం ఏదైనా సరే వారి తలరాతను మార్చగలిగే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందన్నారు. నమ్మిన ముఖ్యమంత్రి విద్యా రంగంలో వినూత్నమైన మార్పు లను తీసుకువచ్చారన్నారు. కలెక్టర్‌ వి.విజరు రామ రాజు మాట్లాడుతూ విద్యాదానం అనంతమైనదని, దానం చేస్తున్నకొద్దీ విజ్ఞానం పెరుగుతుందని తెలిపారు. ప్రతి తల్లీ పాఠశాలల్లో పేరెంట్‌ మీటింగ్‌కు తప్పక హాజరుకావాలన్నారు. మేయర్‌ సురేష్‌బాబు మాట్లాడుతూ ఒక తరాన్ని బాగు చేయాలంటే ఒక కుటుం బంలో అందరూ విద్యావం తులయితేనే సాధ్యమ వుతుందని చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న అమ్మఒడి పథకం ద్వారా పేద కుటుంబంలోని ప్రతి చిన్నారికి విద్య అందుతుందని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా మాట్లాడుతూ విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన ముఖ్యమంత్రి ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో జెసి గణేష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, ఎపి సగర ఉప్పర కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌ జి.రమణమ్మ, ఏపీ చైల్డ్‌ రైట్‌ ప్రొటెక్షన్‌ డైరెక్టర్‌ లక్ష్మీదేవి, స్థానిక కార్పొరేటర్లు షఫీ, సూర్య నారాయణ, పాఠశాల విద్య ఆర్‌జెడి వెంకట కష్ణ, డిఇఒ రాఘవరెడ్డి, ఎస్‌.ఎస్‌.ఏ. పివో డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, డిప్యూటీ డిఇఒ రాజగోపాల్‌ రెడ్డి, విద్యాశాఖ ఎడి దేవరాజు, ఎంఇఒ నారాయణ, పాఠశాల ప్రధా నోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లులు పాల్గొన్నారు.