ప్రజాశక్తి-సంబేపల్లె(రాయచోటి): విద్యకు పేదరికం ఏ మాత్రం ఆటంకం కాకూడదనేదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సంబేపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న అమ్మఒడి పథకం 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంఇఒ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పేదరికం కారణంగా ఏ తల్లీ తన బిడ్డలను బడికి పంపలేని పరిస్థితులు రాకూడదన్న ఉద్దేశ్యంతో వరుసగా నాల్గవ ఏడాది ఆమ్మఒడి కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. విద్యారంగానికి జగన్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మనబడి. నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం విద్య, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, అంగన్వాడీలును వైఎస్‌ఆర్ ప్రీ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌గా మార్పు తదితర పథకాలును అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల కేలెండర్‌ను ఏర్పాటు చేసి, ప్రతి హామీని అమలు చేయడం చారిత్రాత్మకమన్నారు. ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారన్నారు. మండలంలో 3528 విద్యార్థులుకు గాను రూ.5.29 కోట్లు లబ్ధి పొందడం జరిగిందన్నారు. నాలుగేళ్లలో రాయచోటి నియోజక వర్గంలో అమ్మఒడి ద్వారా అందిన సాయం రూ.200 కోట్ల మేర లబ్ధి పొందుతారన్నారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు, ఆశయాలతో పట్టుదల, క్రమశిక్షణలతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యపై ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఈ రాష్ట్ర ఆస్తిగా సిఎం జగన్ భావిస్తున్నారన్నారు. రాయచోటిలో బాలికలకు మూడవ తరగతి నుండి డిగ్రీ వరకు ఒకే ప్రాంగణంలోనే విద్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలో పీజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి దానిని యూనివర్సిటీ స్థాయికి అభివద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి ఆవుల నాగశ్రీ లక్ష్మీ, కార్యక్రమంలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధనరెడ్డి, వైస్ ఎంపిపి పొత్తూరి రవీంద్ర నాయుడు, ఎంఇఒ రమాదేవి, ప్రధానోపాధ్యాయుల నరసింహారెడ్డి, ఎంపిటిసి శ్రీధర్‌రెడ్డి, మండల కన్వీనర్ ఉదరు కుమార్‌రెడ్డి,మండల వ్యవసాయ సలహా సంఘ అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, మండల జెసిఎస్ కన్వీనర్ వడ్డీ వెంకటరమణారెడ్డి, సర్పంచులు అంచల రామచంద్ర, రఘునాథరెడ్డి, దండు నాగభూషన్ రెడ్డి పాల్గొన్నారు.










