సంక్షేమ ఫలాల కరపత్రాలను అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వైసిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 14వ వార్డులో 'గడప గడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. తాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, డ్రెయినేజీ, సిసి రోడ్లు తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గతంలో రోడ్లు వేశారని, డ్రెయినేజీలు ఎత్తుగా వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఆయన ఆదేశించారు. ప్రస్తుతం అన్ని వార్డుల్లో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.










