ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పేదరిక నిర్మూలన వైసిపి ప్రభుత్వ లక్ష్యమని వైసిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని 14వ వార్డు సచివాలయంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసిపి హయాంలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాల రూపంలో లబ్ధి చేకూరుతోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీల మేరకు నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా అర్హత ఉండి పథకాలు అందని వారుంటే వాలంటీర్ల ద్వారా దరఖాస్తులను సచివాలయాల్లో అందజేస్తే పథకాలు మంజూరవుతాయన్నారు. ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వార్డు పరిధిలో సిసి రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
సంక్షేమ ఫలాలను వివరిస్తున్న జగన్మోహన్ రెడ్డి










