Oct 07,2023 17:44

న్యూట్రిషన్‌ స్టాల్స్‌ను పరిశీలిస్తున్న సర్పంచి, అధికారులు

ప్రజాశక్తి - చిప్పగిరి
వైద్యం చేయించుకోవడానికి కూడా ఆర్థిక స్తోమత లేని వారందరికీ వైద్యం అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యమని సర్పంచి ప్రేమ్‌ కుమార్‌, తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం మండలంలోని నేమకల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో సర్పంచి ప్రేమ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి బాలన్న ఆధ్వర్యంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలు అనారోగ్యానికి గురై ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రతి గ్రామంలోనూ ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు జగనన్న సురక్ష అమలు చేస్తున్నారని తెలిపారు. కర్నూలు విశ్వ భారతి ఆస్పత్రి నుంచి వచ్చిన డాక్టర్లు మురళీ మోహన్‌, షేక్‌ రేష్మ, మనోజ్‌, చిప్పగిరి వైద్యాధికారి జమీల్‌ అహ్మద్‌లు 700 మంది పురుషులు, మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరం ఉన్న వారికి మెడిసిన్‌ అందజేశారు. ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రసూన ఆధ్వర్యంలో న్యూట్రిషన్‌ స్టాల్స్‌ను సర్పంచి, తహశీల్దార్‌ పరిశీలించారు. అనంతరం గర్భిణులకు న్యూట్రిషన్‌పై అడిగి తెలుసుకున్నారు. వైసిపి నాయకులు గురుదాసు, సిహెచ్‌ఒ వెంకటేశ్వర్లు, విఆర్‌ఒ వీరన్న పాల్గొన్నారు.