Oct 10,2023 19:54

కోసిగిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

ప్రజాశక్తి - కోసిగి
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' పేదలకు రక్షగా నిలుస్తోందని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని సజ్జలగుడ్డం గ్రామ సచివాలయంలో సర్పంచి జలవాడి నర్సమ్మ అధ్యక్షత ఇఒఆర్‌డి అరుణ్‌ రషీద్‌ ఆధ్వరంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మండల ఇన్‌ఛార్జీ మురళీమోహన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలు ప్రతి ఇంటికీ వెళ్లి వ్యక్తిగత ఆరోగ్య వివరాలను సేకరించి, ప్రభుత్వ డాక్టర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 453 మందికి డాక్టర్లు ప్రవళ్లిక, భాగ్యలక్ష్మి నేతృత్వంలో వైద్యసేవలు అందించినట్లు డాక్టర్లు మనోజ్‌ కుమార్‌, అభిరూప్‌ తెలిపారు. అనంతరం ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ కాత్యాయని ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ చూపిస్తూ, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, ఇతర పోషకాల గురించి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి వివరించారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఎంపిపి ఈరన్న, ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు నాడిగేని నరసింహులు, ఐరన్‌గల్లు శ్రీనివాస రెడ్డి, దశరథ్‌ రెడ్డి, ఎన్‌.నాగరాజు, జగదీష్‌ స్వామి, సౌకత్‌ అలీ, హోళగుంద కోసిగయ్య, దొడ్డి నర్సన్న, నరసింహులు గౌడ్‌, బుళ్లి నరసింహులు, మల్లికార్జున గౌడ్‌, లంకారెడ్డి, జెకె.మల్లయ్య, ముక్కిరయ్య, జి.వెంకటేష్‌, జాంబవంత, పురుషోత్తం, ఎల్లప్ప పాల్గొన్నారు.