Oct 04,2023 23:02

ప్రజాశక్తి-యంత్రాంగం పేదలందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో జగననన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. బుధవారం జిల్లావ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించారు. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాకినాడ కొండయ్యపాలెంలోని పిహెచ్‌సిలో ఎంపీ వంగా గీతా, ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌.నాగనరసింహారావు పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య రంగంలో ఎపిలో అమలు చేస్తున్న పాలనా సంస్కరణలు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చాయన్నారు. 24 గంటలూ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ చేయడమే సిఎం వైఎస్‌.జగన్‌ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కుడా మాజీ చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైసిపి నగర అధ్యక్షురాలు, మాజీ మేయర్‌ సుంకర శివప్రసన్న, ఎఎంసి చైర్మన్‌ పసుపులేటి వెంకటలక్ష్మి, నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం.ఏసుబాబు, ఎంహెచ్‌ఒ డాక్టర్‌ పృథ్వీచరణ్‌, మాజీ కార్పొరేటర్లు కొలగాని దుర్గాప్రసాద్‌, కర్రి శైలజ, బాలాప్రసాద్‌ పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ కాట్రావులపల్లిలో జగనన్న సురక్షలో 440 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. పిహెచ్‌సి వైద్యుడు రాజశేఖర్‌ అధ్వర్యంలో వైద్య పరీక్షలు చేశారు. సర్పంచ్‌ పిట్టా సుగుణరావు, ఎంపిడిఒ వసంత్‌ కుమార్‌, సురిమిల్లి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. రౌతులపూడి మండలంలోని గుమ్మరేగులలో ఎంఎల్‌ఎ పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్‌ శిబిరాన్ని ప్రారంభించారు. 202 మంది రోగులకు వైద్యులు రఘువంశీ, సరోజ, విశ్వనాధ్‌ వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఎం.గోవిందు, తహశీ ల్దారు భీమారావు, సర్పంచ్‌ రాపర్తి రామకృష్ణ, శ్రీను పాల్గొన్నారు. తాళ్లరేవు ఉప్పొంగలలో సర్పంచ్‌ శాఖ శంకరుడు అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఎఎంసి చైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ, జెడ్‌పిటిసి సాగర్‌ పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కళ్ళజోళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ శిబిరంలో గాడిమొగ పిహెచ్‌సి వైదుయలు ఎన్‌.శ్యామల, తాళ్ళరేవు పిహెచ్‌సి వైద్యుడు ఎల్‌.ఈశ్వర్‌ కుమార్‌, వైద్యులు హిమబిందు, దివ్య, రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సుమారు 300 మంది రోగులకు వైద్య సేలదించారు. తహశీల్దారు ఎస్‌.పోతురాజు, లచ్చిపాలెం సొసైటీ అధ్యక్షుడు దవులూరి శ్రీరామ్మూర్తి, చేదురి అరవింద్‌, అనిశెట్టి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కరప అరట్లకట్టలో సర్పంచ్‌ గోపి సత్యవేణి గణేష్‌ అధ్యక్షతన నిర్వహించిన శిబిరంలో ఎంపిపి పి.శ్రీలక్ష్మీ సత్తిబాబు పాల్గొన్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ నాయక్‌ రోగులకు మందులు, కళ్లజోళ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ కె.అప్పారావు, పి.శ్రీనివాసరావు, చింత ఈశ్వరరావు, గొడ్డటిపాలెం సర్పంచ్‌ శ్రీనుబాబు పాల్గొన్నారు.