Sep 04,2023 22:32

మాట్లాడుతున్న చేజర్ల వెంకటేశ్వరరెడ్డి

మాట్లాడుతున్న చేజర్ల వెంకటేశ్వరరెడ్డి
పేదలందరికీ గ్యాస్‌ సబ్సిడీ ఇవ్వాలి
ప్రజాశక్తి-కోవూరు:కంద్ర ప్రభుత్వం ఉజ్వల గ్యాస్‌ యోజన వినియోగదారులకు ప్రకటించిన రూ.400 రాయతీనీ గ్యాస్‌ వినియోగదారులు అందరికీ వర్తింప చేయాలని టిడిపి జిల్లా ప్రదాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్‌పిజి వినియోగదారులు కోటి యాభై లక్షల మంది ఉంటే వారిలో ఉజ్వల పథకం కింద 5.1 లక్షలు మంది మాత్రమే ఉన్నారన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.400 తగ్గింపు కేవలం 3.4 శాతం మందికి మాత్రమే ప్రయోజనం కలుగుతుందన్నారు.2014లో గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ.410 ఉంటే నేడు రూ.1150 కి చేరింది. ఎన్‌డిఎ పాలనలో గ్యాస్‌ ధర మూడు రెట్లు పెరిగిందన్నారు. .
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీపం పథకం కింద 32 లక్షలు కనెక్షన్లు ఇచ్చారన్నారు. .తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ఏడాదికి ప్రతి కుటుంబానికీ మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తా మన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.400 తగ్గింపు కేవలం రాష్ట్రంలో 3.4 శాతం మందికి మాత్రమే వర్తిస్తుం దన్నారు. కేవలం 3.4 శాతం మందికే ప్రయోజనం కలుగుతుందన్నారు.