Oct 12,2023 21:29

ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, జెడ్పీ ఛైర్మన్‌, కలెక్టర్‌

          గోరంట్ల రూరల్‌ : సొంతింటి కలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పట్టాలను మంజూరు చేసి గృహాలను నిర్మించి ఇస్తోందని పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ తెలిపారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లుసామూహిక గహ ప్రవేశాల జిల్లా స్థాయి కార్యక్రమాన్ని గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామంలో గురువారం నిర్వహించారు. మల్లాపల్లి గ్రామంలో పూర్తిచేసిన జగన్నకాలనీని ఎమ్మెల్యే శంకర నారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే శంకర నారాయణ మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సాకారం చేస్తున్నారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల ముందు తన పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి నవరత్నాల పేరిట గహాలను మంజూరు చేసారన్నారు. ఇంకా అర్హత కలిగిన వారుంటే ఖాళీ స్థలాల్లో వారికి పట్టాలు మంజూరు చేస్తామన్నారు. జెడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సాకారం చేస్తున్నారని చెప్పారు. పేదల ఇళ్లు కాదు.. ఊళ్లనే నిర్మించి ఇస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతోందన్నారు. కలెక్టర్‌ అరుణ్‌బాబు మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. పునాదులు, ఆపై స్థాయిలో ఉండే గహాలు ఉన్నాయని, వాటిని కూడా పూర్తి చేయాల్సి ఉందన్నారు. రానున్న కాలంలో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. కాలనీలో బైపాస్‌ రోడ్డు వల్ల నష్టపోయిన లబ్ధిదారులకు త్వరలో మరొక చోటలో గహ నిర్మాణం చేపట్టి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ రమణారెడ్డి, హౌసింగ్‌ డైరెక్టర్‌ శైలేంద్రనాథరెడ్డి, హిందూపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఇంద్రజ, జెడ్పీటీసీ జయరామ్‌ నాయక్‌, ఎంపీపీ ప్రమీలమ్మ మూర్తి, సర్పంచి శివానంద, సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ శంకర్‌రెడ్డి, ఆర్డీవో భాగ్యరేఖ, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ విజరు కుమార్‌, తహశీల్దార్‌ రంగనాయకులు, ఎంపీడీవో రఘునాథ్‌ గుప్తా, హౌసింగ్‌ పీడీ చంద్రమౌళి రెడ్డి పాల్గొన్నారు.