Nov 14,2023 20:56

వృద్ధురాలికి మందులు పంపిణీ చేస్తున్న వైద్యులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' పేదల పాలిట వరమని డాక్టర్‌ జి.మధులిక, డాక్టర్‌ జి.రవిచంద్ర, డాక్టర్‌ జె.మయూర్‌ కుమార్‌, డాక్టర్‌ శాంతి జ్యోతి తెలిపారు. మంగళవారం మండలంలోని మండిగిరి సచివాలయం-1 పరిధిలో ఆర్‌జి నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో 'జగనన్న అరోగ్య సురక్ష'ను ఇన్‌ఛార్జీ ఇఒఆర్‌డి నాగరాజు ప్రారంభించారు. 515 మందికి పైగా రోగులకు వైద్యసేవలు అందించారు. సుమారు 60 మంది వృద్ధులకు కంటి పరీక్ష నిర్వహించి, అద్దాలు పంపిణీ చేశారు. బిపి, షుగర్‌, ఈసీజీ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కంటి పరీక్షలు కూడా చేపట్టారు. అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారం స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి. ఎంపిహెచ్‌ఒ లక్ష్మీనారాయణ, ఫార్మాసిస్ట్‌ వాసుదేవరెడ్డి, సూపర్‌వైజర్‌ సరోజమ్మ, ఎఎన్‌ఎంలు ఝాన్సీ, జయమ్మ, విజయలక్ష్మి, సురేఖ, సిహెచ్‌ఒ సరిత పాల్గొన్నారు.