నిత్యావసర సరుకుల కిట్లు అందజేస్తున్న మంత్రి నాగార్జున
ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని పెదపులివర్రు గ్రామం జిలుగువారిపాలెంలో రావెల జార్జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర కిట్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మెరుగు నాగార్జున చేతుల మీదుగా అందజేశారు. చిత్తూరుకు చెందిన రీడ్స్ సౌజన్యంతో అందజేసిన ఈ కిట్ల పంపిణీ అభినందనీయమని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలా ఉషారాణి రమేష్, ఎంపిపి డివి లలితకుమారి, నాయకులు నీలా నాగరాజు, కత్తులు సందీప్, బాబూరావు, న్యాయవాదులు చంద్రశేఖర్, శేరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










