Nov 17,2022 00:11

మాట్లాడుతున్న టిడిపి నేత కుమార్‌

ప్రజాశక్తి-మాడుగుల: వైసీపీ ప్రభుత్వంలో పేదలకు సొంత ఇల్లు కలగా మారాయని టిడిపి ఇన్చార్జ్‌ కుమార్‌ విమర్శించారు .బుధవారం మాడుగులలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేదలకు సొంత గూడు కల్పిస్తామని ఎన్నికల ముందు వైసీపీ నేతలు హామీ ఇచ్చారన్నారు. 42 నెలలు గడిచినప్పటికీ పేదలకు పూర్తిస్థాయి గృహాల నిర్మాణాలు జరగలేదన్నారు. ఉపముఖ్యమంత్రి ముత్యాల నాయుడు పేదలకు సొంత ఇల్లు నిర్మించామని చెప్తున్నారని ఎంతమందికి ఎన్ని ఇల్లు మంజూరు చేశారో తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో పలు గ్రామాలలో గోతులు మయంగా ఉన్న స్థలాలలో పట్టాలు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు రంజిత్‌ వర్మ, ఎన్‌వి ప్రసాద్‌, పుప్పాల రమేష్‌, పిఎస్‌ఎన్‌ రాజు, కోన నాగేశ్వరరావు, తుంపాల రామకొండ తదితరులు పాల్గొన్నారు.