
రగ్గులు పంపిణీ చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు : శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి ఆధ్వర్యంలో సోమవారం కీ.శే.కాళిదాసు భారతి జయంతి సందర్భంగా వారి కుమార్తెలు సురేఖ, గీతా గార్ల సహకారంతో పట్టణంలోని యాచుకులకు, దివ్యాంగులుకు ఉలెన్ రగ్గులు పంపిణీ చేశారు. శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు మాట్లాడారు. అదేవిధంగా శ్రీ రామ సాయి బాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా సోమవారం లిబత్తిని నాగేశ్వరరావు, మాధవి లత దంపతుల మనవరాలు బత్తిని విష్ణు చైతన్య, సాయి కుమారి, దంపతుల కుమార్తె సౌమిక పుట్టినరోజు సందర్భంగా స్వర్ణ స్వయంకషి మానసిక వికలాంగుల ఆశ్రమంలోని పిల్లలకు, మధిర ఆదరణ అనాధ వద్ధాశ్రమంలో ఉన్న వారికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు.