ప్రజాశక్తి- భోగాపురం: పేదలకు పథకాలు అందించమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని సవరవల్లి సచివాలయం పరిధిలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సర్పంచ్ ఉప్పాడ విజయ భాస్కర్‌రెడ్డి, వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గురించి వివరించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా బడ్డుకొండ అప్పలనాయుడును గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి తాతయ్యలు, ఎంపిడిఒ అప్పలనాయుడు, తహశీల్దార్ చింతాడ బంగార్రాజు, నాయకులు పడాల శ్రీనివాసరావు, భాను, సుందర హరీష్, వాసుపల్లి రెయ్యుడు, కర్రోతు వెంకటరమణ, ఏ పైడి నాయుడు, పూసర్ల వెంకటరమణ పాల్గొన్నారు.
బాడంగి: ప్రజలు ఎదురుకొంటున్న సమస్యలను పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి ఉద్దేశ్యం అని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు అన్నారు. మండలంలోని గజరాయనివలసలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ పేదల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈ ప్రభుత్వం అందిస్తుందన్నారు. తాగు నీటి కోసం ప్రత్యక చర్యలు తీసికోవాలని అధికారులకు సూచించారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందకపొతే వెంటనే సచివాలయం సిబ్బంది తగు చర్యలు తీసికోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు శంబంగి వేణుగోపాల్, బి వెంకట్ నాయుడు, తెంటు మధు, మరిపి శంకర్, జెడ్‌పిటిసి రామారావు, ఎంపిడిఒ ఆంజనేయలు తదితరులు పాల్గొన్నారు.