
ప్రజాశక్తి-పాయకరావుపేట:మండలంలో మాసాపేట గ్రామంలో ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను గడపగడపకి మన ప్రభుత్వంలో భాగంగా ఎమ్మెల్యే గొల్ల బాబురావు సోమవారం పర్యటించారు. ప్రతి గడప వద్దకు వెళ్లి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి గడప గడపకు కార్యక్రమం ప్రారంభించామన్నారు. పేద ప్రజలందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వివరించారు. బడుగు, బలహీన వర్గాలకు, పేద ప్రజలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గెడ్డమూరి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్, ఉత్తరాంధ్ర ఎన్నికల పరిశీలకులు చిక్కాల రామారావు, జడ్పిటిసి లంక సూరిబాబు, ప్రచార పబ్లిక్ వింగ్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా, ఉప సర్పంచ్ జగత శ్రీను, తదితరులు పాల్గొన్నారు.