మంగళగిరి రూరల్: పదహారేళ్లుగా నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు, ఇంటి పన్ను కల్పించాలని మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం లోని నిమ్మగడ్డ రామ్మోహన రావు నగరవాసులు సచివాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించి కార్పొరేషన్ అధికారులకు అర్జీలు అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జెవి రాఘవులు మాట్లాడుతూ 2007 నుండి పేదలు నివసిస్తున్న నిమ్మగడ్డ రామ్మోహనరావునగర్‌కు ఎంపి రాయపాటి సాంబశివ రావు నిధులు ద్వారా విద్యుత్, ఎమ్మెల్సీ ఎస్ లక్ష్మణరావు నిధుల ద్వారా కృష్ణా వాటర్, ప్రస్తుత ఎంపీ విజయసాయిరెడ్డి, మండల పరిషత్ నిధులు ద్వారా సిసి రోడ్లు ఏర్పాటు చేసిన అధికారులు 225 జీవో ప్రకారం గ్రామంలో వివిధ పోరంబోకు స్థలాల్లో నిమ్మగడ్డ రామ్మోహన రావు నగర్ లో నివసించు పేదలందరికీ పట్టాలిచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్య క్రమంలో సిపిఎం మండల నాయకులు మొసలి పకీరయ్య, కార్య దర్శి వుద్దంటి దుర్గారావు, చిట్టేల జనార్ధనరావు, చిట్టేల సీతా రామాంజనేయులు, చిట్టేల గిరిధరరావు, గడ్డం అజరు కుమార్ ,వెంగళ రామారావు, ఆనందం, బాబ్జి, బిట్ర రాంబాబు, వద్ది సురేష్, గౌరబత్తుల లక్ష్మి పాల్గొన్నారు.










