Aug 24,2023 20:50

ప్రజాశక్తి - కాళ్ల
జన్మదిన వేడుకలు ఆడంబరంగా జరుపుకోకుండా పేదలకు దుస్తులు, పండ్లు పంపిణీ చేయడం అభినందనీయమని డిసిసిబి చైర్మన్‌, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహారాజు అన్నారు. పెదఅమిరం గ్రామ సర్పంచి డొక్కు సోమేశ్వరరావు మనవడు కార్తికేయ మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 700 మంది పేదలకు పివిఎల్‌ నరసింహారాజు చేతుల మీదుగా దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. పేదలకు చీరలు, దుప్పట్లు, రగ్గులు, పంచెలు యాపిల్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచి డొక్కు సోమేశ్వరరావు మాట్లాడగా కార్యక్రమంలో మాజీ సర్పంచులు కఠారి విశ్వనాథరాజు, యిర్రింకి పద్మనాభం, మాజీ ఉప సర్పంచులు కోరా రామ్మూర్తి, నడింపల్లి సుబ్బరాజు, కోపల్లె సొసైటీ అధ్యక్షులు వేగేశ్న జయరామకృష్ణంరాజు, బూరాడ వెంకటకృష్ణ, కలువ వెంకట్రావు, మాజీ ఎంపిటిసి రామకష్ణంరాజు,డొక్కు సోమేశ్వరరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.