Sep 10,2023 19:33

పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు డివిజన్‌ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో మార్కెట్‌ యార్డు సమీపంలో నివసిస్తున్న నిరుపేదలకు ఆదివారం దుప్పట్లు పంపిణీ చేశారు. సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్‌ మాట్లాడుతూ దాతల సహకారంతో రగ్గులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మానవతాదక్పథంతో ఆలోచించి సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో విశ్వ, నితీష్‌, ఉదరు కుమార్‌ పాల్గొన్నారు.