Mar 13,2023 01:53
దుప్పట్లు పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-బాపట్ల: నిరుపేదలకు సహాయం అందించడంలో నిజమైన సంతృప్తి ఉందని జర్మనీ దేశస్థుడు టోనీ బ్రౌన్‌ అన్నారు. ఆదివారం బాపట్ల పట్టణంలో బేతనీ కాలనీలో కుష్టు వ్యాధిగ్రస్తులకు దుప్పట్లు పంపిణీ చేశారు. యాదవపాలెంలో విద్యార్థులకు గోడ గడియారాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా టోనీ మాట్లాడుతూ గత 20 యేళ్లుగా జర్మనీ నుంచి భారతదేశాన్ని సందర్శించడంలో భాగంగా ప్రధానంగా బాపట్లలో పేదవారికి అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలు, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి టోనీ బ్రౌన్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ తోటా మల్లేశ్వరి, బొంతగోర్ల వెంకట్రావు పాల్గొన్నారు.