

పేదలకు భూములు చూపండి..
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం
కలెక్టరేట్ ముందు భాధితులు ధర్నా
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చిన పేదలకు భూములు చూపించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు ఎం నాగేశ్వరావు , ఎం సుధాకర్ అధికారులను హెచ్చరించారు. సోమవారం నంద్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాయకులు టి.ఓబులేష్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిడుతూరు మండల కేంద్రం లమిడుతూరుకు చెందిన పేదలకు 1996లో 46 కుటుంబాలకు అలగనూరు పొలిమేరలో సర్వేనెంబర్ 22,25 ,26 ,47 ,68 376 తదితర సర్వే నెంబర్లు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారని వాటిపై ప్రభుత్వ బ్యాంకుల్లో సొసైటీలో పంట రుణాలు తెచ్చుకోవడం జరిగిందన్నారు.ప్రభుత్వం ద్వారా సబ్సిడీ విత్తనాలు ఎరువులు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు.పట్టాలు ఇచ్చిన దళితులకు భూములు చూపాలని ఆనాటి నుండి నేటి వరకు వచ్చిన ప్రతి తాహాసిల్దార్ కు ఆర్డిఓ కు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం లేదన్నారు.అనేకసార్లు ఆందోళన చేసినప్పటికీ అధికారులు సర్వే పేరుతో కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు, నేడు ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాలు రికార్డులో మెన్షన్ కాలేదని ఈ డూప్లికేట్ పట్టాలని తెలియజేస్తున్నారు కావున డూప్లికేట్ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులను వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని వారి డిమాండ్ చేశారు .దళితులకు ఇచ్చిన పట్టా భూముల్లో సొంత భూములు కలిగిన వారు కర్నూల్ లో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉన్నవారు మిడుతూరు మండలంలో బినామీ పేర్లతో పట్టాలు పొంది భూములు కబ్జా చేసుకుని ప్రభుత్వ బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు ,జిల్లా ఉన్నతాధికారుల తో న్యాయ విచారణ జరిపించి పేదలకు న్యాయం చేయాలని వారు కోరారు, పోలీసులు శాంతియుతంగా ఆందోళన చేయడానికి పర్మిష్టినీయకుండా ఉద్యమాలను అంచి వేయడానికి ప్రయత్నిస్తున్నారని వారారోపించారు, గత 27 సంవత్సరాల క్రితం పేదలకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి ఇంతవరకు భూములు చూపకుండా అధికారులు బాధ్యతరహితంగా పనిచేస్తున్నారని వారి ఆరోపించారు. అనంతరం పోలీసులకు వ్యవసాయ కార్మికులకు వాదోపవాదుల వాదన జరిగింది అనంతరం డిప్యూటీ కలెక్టర్ ధర్నా దగ్గరకు వచ్చి సమస్యను జేసీతో మాట్లాడి పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది తాసిల్దార్ ధర్నా దగ్గర నుండే తాసిల్దార్ కు ఫోన్ చేసి సమాచారం అడగగా సర్వే తర్వాత మిగులు భూమిని గుర్తించి పంపించేస్తామని లేదా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అనంతరం రైతు సంఘం జిల్లా నాయకులు నరసింహ సిఐటియు నాయకులు రత్నమయ్య కేఏపీఎస్ నాయకులు లింగస్వామి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దత్త కుమార్ బీసీ సంఘం నాయకులు కురుమూర్తి ధర్నాకు సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి పకీరు సాహెబ్ డేవిడ్ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చిన పేదలు జయరాముడు తిరుపాలు తిరుపతయ్య మద్దిలేటి పుల్లన్న జయమ్మ లింగమ్మ జయ లక్ష్మ మరియమ్మ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు