
ప్రజాశక్తి - మొగల్తూరు
ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షను చేపట్టిందని ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. బుధవారం మొగల్తూరు-2 పడమటిపాలెం గ్రామ సచివాలయం వద్ద జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు తిరుమాని బాపూజీ, వైస్ ఎంపిపిలు కైలా సుబ్బారావు, కవురు సీతామాలక్ష్మి, సర్పంచి పడవల మేరీ సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.
గణపవరం : పేదవాడికి ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు అన్నారు. బుధవారం గణపవరం జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశానికి గణపవరం గ్రామ సర్పంచి మూర అలంకారం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడారు. శిబిరంలో 412 మందికి వైద్య సేవలందజేశారు. అనంతరం కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఆరుగురికి కళ్లజోళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి డాక్టర్ పి.సంతోష్ నాయుడు, పి.కిరణ్మయి, తాడేపల్లిగూడెం ప్రసూతి వైద్యులు ఎం.దివ్యవాణి పాల్గొన్నారు.
పెనుమంట్ర : ప్రజలంతా ఆరోగ్య సురక్షను సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసు రెడ్డి) అన్నారు. బుధవారం నత్తారామేశ్వరంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సర్పంచి వెలగల ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ పి.పద్మజ, ఎఎంసి ఛైర్మన్ వెలగల వెంకటరమణ (మిస్సమ్మ), వైద్యాధికారిణి కె.లావణ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీశైలపు నాగేంద్రకుమార్ పాల్గొన్నారు.
ఆచంట : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఎంపిడిఒ నరసింహ ప్రసాద్ అన్నారు. శేషమ్మచెరువు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం సర్పంచి జక్కంశెట్టి శ్రీరాములు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపిడిఒ నరసింహప్రసాద్ వైద్య సేవల పనితీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. అనంతరం కంటి వెలుగు ద్వారా వృద్ధులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పౌష్టికాహార స్టాల్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు శివరంజని, సత్యవతి, వేణు, కిషోర్, ఇఒపిఆర్‌డి బాబు, పంచాయతీ కార్యదర్శి శ్రీరాములు పాల్గొన్నారు.
పాలకొల్లు రూరల్ : అరట్లకట్ట గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సర్పంచి పాస్ రాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసిపి ఇన్‌ఛార్జి గుడాల గోపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసి చింతపల్లి సాయిబాబు, ఎంపిపి చిట్టూరి కనకలక్ష్మి, జెడ్‌పిటిసి నడపన గోవిందరాజుల నాయుడు, టిటిడి సభ్యులు మేకా శేషుబాబు, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.