
విజయవాడ : సిద్ధార్థ సోషల్ సర్వీస్ సొసైటీ విజయవాడవారు డాక్టర్స్ బ్లడ్ బ్యాంక్‌వారి సౌజన్యంతో గత బుధవారం విజయవాడ కోర్టు సెంటర్ సిఎస్‌ఐ కాంప్లెక్స్ ఎదురుగా 1500మందికి వాటర్, మజ్జిగను పంపిణీ చేశారు. 50మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ సోషల్ సర్వీస్ సొసైటీ ప్రెసిడెంట్ నీలం గోపికృష్ణ, సొసైటీ సభ్యులు, డాక్టర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, సిమ్స్ హాస్పిటల్ డాక్టర్ గర్రె శంఖరరావు పాల్గొన్నారు.