Apr 09,2023 00:12

అన్నదానం నిర్వహిస్తున్న దాతలు

ప్రజాశక్తి - చీరాల : పేదల అవసరాలను గుర్తించి వారికి చేయూతనందించేందుకు పద్మ భాస్కర్‌ ఫౌండేషన్‌ స్థాపించినట్లు ఫౌండేషన్‌ చైర్మన్‌ ఘంటా అనిల్‌ తెలిపారు. చీరాల పట్టణంలోని 31వ వార్డ్‌ రోశయ్య కాలనీలో పద్మ భాస్కర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ చైర్మన్‌ గంట అనిల్‌ మాట్లాడుతూ పద్మ భాస్కర్‌ ఫౌండేషన్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలునిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని దానాలలో అన్న దానం గొప్పదని తెలిపారు. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులై నన్నపనేని వెంకటసుబ్బరావు సతీమణి ఇందిరా దేవి స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్నదానానికి సాయం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వలివేటి పూర్ణచంద్ర రావు, ఘంటా కుసుమ కుమారి,31వ వార్డు కౌన్సిలర్‌ సల్లూరు సత్యా నందం, రోశయ్య కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.