బాపట్లలోని అన్నా క్యాంటిన్‌లో పేదలకు అన్నం వడ్డిస్తున్న వేగేశన నరేంద్రవర్మ
ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో బాపట్లలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ విజయవంతంగా సాగుతోంది. ఈ క్యాంటిన్‌ను ప్రారంభించి శనివారానికి 202 రోజులు పూర్తయ్యాయి. శనివారం బాపట్లకు చెందిన జిట్టా శ్రీనివాసరావు తండ్రి జిట్టా తులసీ నారాయణ 90వ జయంతి, కుమార్తె సాయి చైతన్య పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో 300 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు వేగేశన నరేంద్రవర్మ, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










