ప్రజాశక్తి - చీరాల
పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తాము కృషి చేస్తున్నట్లు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు అన్నారు. షుగర్ వ్యాధితో బాధపడే వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించడంమే లక్ష్యంగా తమ హాస్పిటల్ పర్మినెంట్ డాక్టర్ల వైద్య బృందంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. షుగర్ స్పెషలిస్ట్ డాక్టర్ మిధున్ కుమార్ చౌదరి, ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్ చైతన్య చౌదరి వైద్య సేవలను అందిస్తూ వున్నారని తెలిపారు. చీరాల క్షీరపురి రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 85మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి అధ్యక్షులు కార్యదర్శులు నన్నప్పనేని రామకృష్ణ, బాచిన నాగమల్లేశ్వరరావు, డాక్టర్ విజయకుమార్, రావి వెంకట రమణారావు, హాస్పిటల్ జనరల్ మేనేజర్ తాడివలస సురేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










